Visakhapatnam/Padmanabham (ప్రశ్న ఆయుధం) జూలై 02
రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ డాక్టర్స్ డే ను క్లబ్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి DM&HO డా. జె. వెంకట్, IMA అధ్యక్షుడు డా. మల్లికార్జున్ రావు, ప్రోగ్రామ్ చైర్మన్ డా. కె. వెంకట్రాజం, past Asst.గవర్నర్ యం.జైపాల్ రెడ్డి, CA Ramesh ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ డాక్టర్స్ డే ను క్లబ్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా DM&HO డా. జె. వెంకట్ గారు, ఆత్మీయ అతిథిగా కామారెడ్డి IMA అధ్యక్షుడు డా. మల్లికార్జున్ రావు గారు, ప్రోగ్రామ్ చైర్మన్ డా. కె. వెంకట్రాజం గారు, past Asst.గవర్నర్ యం.జైపాల్ రెడ్డి, CA Ramesh పాల్గొన్నారు.
ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు సబ్బని కృష్ణ హరి మాట్లాడుతూ వైద్యవృత్తిని, వృత్తిగా మాత్రమే కాకుండా, సేవాభావంతో రోగుల బాధలను తమ బాధలుగా భావించి రాత్రింబగళ్ళు విశ్రాంతి లేకుండా సేవచేసే మహోన్నత వ్యక్తులు డాక్టర్లు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి పట్టణంలో విశిష్ట సేవలు అందిస్తున్న డాక్టర్ చింత శుభశ్రీ, డాక్టర్ చందరి సంతోష్, డాక్టర్ ఘన శ్యామ్ పటేల్, డాక్టర్ రేనికింది మానస, డాక్టర్ ఎర్రోళ్ల స్నేహ, డాక్టర్ కొంగి దివ్యభారతి, డాక్టర్ పల్స హరీష్ గౌడ్ లను ఘనంగా సన్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి కార్యదర్శి సోమిశెట్టి సంతోష్, కోశాధికారి మాటూరి బైరయ్య, past Presidents యాచం శంకర్, రాజ నర్సింహారెడ్డి, రోటరీ సభ్యులు A. బాల కిషన్, బండమీది రాజేశం, దూస వెంకటస్వామి, డాక్టర్ విజయ్ కుమార్, ధనంజయ, వెంకటరమణ, నాగభూషణం, జగన్నాథం, కమ్మరి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.












