సంగారెడ్డి, జూలై 20
అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) ఆధ్వర్యంలో సదాశివపేట పట్టణంలో శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, పూజలు నిర్వహించి ఈ ఆధ్యాత్మిక వేడుకను ప్రారంభించారు.
అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) ఆధ్వర్యంలో సదాశివపేట పట్టణంలో శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక వేడుకకు డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, పూజలు నిర్వహించి రథయాత్రను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో సదాశివపేట మున్సిపల్ చైర్ పర్సన్ మునిపల్లె అంజమ్మ సత్యనారాయణ, వైస్ చైర్మన్ రేణుక చిరు, సీడీసీ చైర్మన్ రామ్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంది కృష్ణ, నాయకులు సత్యనారయణ, పృధ్వీరాజ్, ఇస్కాన్ ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా, బీఆర్ఎస్ పార్టీ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి మందుల రాధా కృష్ణ సోమవారం డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాధాకృష్ణకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సుధాకర్ గౌడ్, జార్జ్, కూన సంతోష్, కిరణ్ గౌడ్, మహేష్ ముదిరాజ్, తోపాజి హరీష్, నగేష్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.












