సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్ను రాష్ట్ర ఎన్నికల సంఘం అడిషనల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ గురువారం పరిశీలించారు. ఈవీఎంల భద్రత, నిర్వహణపై అధికారులు సమీక్షించారు.
జిల్లా కేంద్రంలోని పాత డీఆర్డీఏ కార్యాలయ ఆవరణలో ఉన్న ఈవీఎం గోడౌన్ను రాష్ట్ర ఎన్నికల సంఘం అడిషనల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తో కలిసి గురువారం పరిశీలించారు.
సాధారణ తనిఖీల్లో భాగంగా ఈవీఎంల భద్రతా ఏర్పాట్లు, గోడౌన్ నిర్వహణ, తదితర అంశాలను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గోడౌన్ సీళ్లను తనిఖీ చేసి, అక్కడ ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, భద్రతా ప్రమాణాల అమలుపై వివరాలు తెలుసుకున్నారు.
ఈ తనిఖీలు ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, భద్రతను నిర్ధారించే దిశగా చేపట్టారు. ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం అధికారులు, సిబ్బంది, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.












