సంగారెడ్డి జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి బుధవారం జిల్లాలోని వివిధ సంక్షేమ కేంద్రాలను సందర్శించి, పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి సంగారెడ్డిలో నిర్మాణంలో ఉన్న వయోవృద్ధుల ఆశ్రమం పనులను పరిశీలించారు. పనుల పురోగతిని స్వయంగా తనిఖీ చేసి, నాణ్యతా ప్రమాణాలతో పాటు వేగంగా పూర్తి చేయాలని సూచించారు.
ఆమె బాల రక్షాభవన్, సఖి కేంద్రం, పిల్లల సంక్షేమ కేంద్రం, ప్రణామ్ డే కేర్ సెంటర్, శిశు గృహం, శ్రావణ గ్రంథాలయంలను కూడా సందర్శించి, అక్కడి నిర్వహణ, సౌకర్యాలు, సేవల అమలుపై సమీక్షించారు.
మహిళలు, పిల్లలు, వృద్ధులకు సంక్షేమ సేవలు మరింత సమర్థంగా అందేలా చూడాలని అధికారులకు సూచనలు జారీ చేశారు. పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యం వహించవద్దని లలిత కుమారి స్పష్టం చేశారు.
ఈ సమీక్షా కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.












