నిజామాబాద్‌లోని శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు తాజాగా ప్రకటించిన పదో తరగతి (SSC) పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, పాఠశాల గౌరవాన్ని పెంచారు. పలువురు విద్యార్థులు ఉన్నత మార్కులతో ఉత్తీర్ణులయ్యారు.
ఈ సంవత్సరం పదో తరగతి ఫలితాల్లో శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు తమ విద్యా సామర్థ్యాన్ని మరోసారి నిరూపించుకున్నారు. ఐపీఎల్ విభాగంలో ప్రణవి 588/600 మార్కులతో అగ్రస్థానంలో నిలవగా, అభిరామ్ 585, శ్రీలస్య 581, రిషిత 580, వరుణ్ 579 మార్కులు సాధించారు. సి-బ్యాచ్‌కు చెందిన సాత్విక 577 మార్కులతో మెరిశారు.
పాఠశాల ఏజీఎం అఫీజ్, కో-ఆర్డినేటర్ మహిపాల్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, విద్యార్థుల కృషి, అంకితభావం ఫలితాల్లో ప్రతిఫలించాయని తెలిపారు. ఉపాధ్యాయుల నిరంతర పర్యవేక్షణ, శిక్షణ విద్యార్థుల విజయానికి దోహదపడ్డాయని పేర్కొన్నారు.
శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను అభినందించారు. ఈ విజయం శ్రీ చైతన్య విద్యాసంస్థలకు గర్వకారణమని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించేలా విద్యార్థులను ప్రోత్సహిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్స్ గురుచరణ్, స్వప్న, డీన్లు, ఇంచార్జులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థులందరికీ పాఠశాల యాజమాన్యం శుభాకాంక్షలు తెలియజేసింది.











