బాల్కొండ మండల కేంద్రంలో శుక్రవారం సబ్ కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో రైతులకు పట్టా పాస్ బుక్ ఆధార్ సీడింగ్ వేగవంతంగా పూర్తి చేయాలని సబ్ కలెక్టర్ సూచించారు.
తర్వాత, ఆయన తాసిల్దార్ కార్యాలయంలోని రికార్డు కార్యాలయాన్ని తనిఖీ చేశారు.
ఈ సందర్శనలో తహశీల్దార్ శ్రీనివాస్, ఆర్ ఐ, రెవెన్యూ సిబ్బంది తదితరులు ఆయన వెంట ఉన్నారు.












