మైనర్ విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకున్నందుకు పెన్సిల్వేనియాకు చెందిన ఒక ఉపాధ్యాయురాలికి అమెరికా కోర్టు 15 నెలల జైలు శిక్ష విధించింది. ఆమె విద్యార్థికి గంజాయి కూడా అందించినట్లు ఆరోపణలున్నాయి.
36 ఏళ్ల మిషెల్ మెర్కోగ్లియానో తన నేరాన్ని అంగీకరించడంతో, చెస్టర్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం ఈ శిక్షను ప్రకటించింది. జైలు శిక్షతో పాటు, ఆమె ఆరున్నరేళ్ల పాటు ప్రొబేషన్‌లో ఉండాలని కోర్టు ఆదేశించింది.
ఈ సంఘటన గత ఏడాది జరిగింది. హైస్కూల్ విద్యార్థితో మెర్కోగ్లియానో పలుమార్లు లైంగికంగా కలిసినట్లు తేలింది. ఆమె సుమారు 15 సార్లు 'మెడికల్ మరిజువానా' కొనుగోలు చేసి, ఆ తర్వాత విద్యార్థితో కలిసి దానిని సేవించి, లైంగిక చర్యల్లో పాల్గొన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ సంఘటనలు వేన్ పట్టణంలోని ఆమె తల్లిదండ్రుల ఇంట్లోనే జరిగినట్లు తెలుస్తోంది.
విద్యార్థి ఈ విషయాలను తన సోదరికి చెప్పడంతో ఈ ఉదంతం బయటపడింది. విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఉపాధ్యాయురాలిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె టీచింగ్ లైసెన్స్‌ను రద్దు చేశారు. ప్రొబేషన్ కాలంలో పిల్లలతో మాట్లాడటం లేదా కలిసి ఉండటంపై ఆమెపై నిషేధం విధించారు.










