నిజామాబాద్, 2026-08-02
ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు, హైదరాబాద్ ఆదేశాల మేరకు టెక్నికల్ టీచర్స్ సర్టిఫికేట్ (లోయర్ గ్రేడ్) థియరీ పరీక్షలు ఆదివారం నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయి. టైలరింగ్, డ్రాయింగ్, మ్యూజిక్ విభాగాలకు సంబంధించిన ఈ పరీక్షలను నిజామాబాద్‌లోని ఎస్ఎన్వీపీ హైస్కూల్, ఏహెచ్‌వీ ఇంగ్లిష్ మీడియం స్కూల్ కేంద్రాల్లో నిర్వహించారు.

పరీక్షల వివరాలు
మొదటి పేపర్ ఎడ్యుకేషనల్ సైకాలజీ అండ్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్‌కు 465 మంది అభ్యర్థులకు గాను 453 మంది హాజరుకాగా, 12 మంది గైర్హాజరయ్యారు. రెండో పేపర్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ (జనరల్)కు కూడా 465 మందిలో 453 మంది హాజరై, 12 మంది గైర్హాజరయ్యారు. మూడో పేపర్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ (స్పెషల్)కు 465 మందిలో 451 మంది హాజరుకాగా, 14 మంది పరీక్షకు హాజరు కాలేదు.
అవాంఛనీయ ఘటనలు లేవు
జిల్లాలో అన్ని పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పరీక్షలు సజావుగా ముగిసినట్లు జిల్లా విద్యా అధికారి (డి ఇ ఓ) అశోక్ తెలిపారు.