నిజామాబాద్, 2026
తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖలో 7,437 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 9 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు తెలంగాణ పోలీస్ నియామక ప్రక్రియ2026కు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేశారు.

ఉద్యోగాల నోటిఫికేషన్ వెలువడడంతో నిజామాబాద్ జిల్లా యువతలో ఉత్సాహం నెలకొంది. వివిధ మైదానంలలో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వందలాది మంది అభ్యర్థులు పరుగులు, శారీరక దారుఢ్య వ్యాయామాలు, ఇతర కసరత్తులతో నిమగ్నమవుతున్నారు.
ఈసారి తప్పకుండా పోలీస్ ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న యువత నోటిఫికేషన్ విడుదలైన తర్వాత శిక్షణను మరింత ముమ్మరం చేసింది. ట్రైనర్ల పర్యవేక్షణలో ఫిజికల్ ఈవెంట్లకు ప్రత్యేకంగా సాధన కొనసాగిస్తున్నారు.
అభ్యర్థులు దరఖాస్తు గడువులను గమనించి, అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.