తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజులు పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు మంగళవారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే సూచనలున్నాయని అంచనా వేసింది.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, మంగళవారం (మార్చి 25) నాడు ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పలు జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది.
ముఖ్యంగా ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఈ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
బుధవారం (మార్చి 26) మరియు గురువారం (మార్చి 27) తేదీలలో కూడా రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ శాఖ సూచనలను పాటించాలని సూచించారు.











