ఫెడరేషన్ కప్ జాతీయ త్రోబాల్ పోటీల్లో తెలంగాణ మహిళా జట్టు రన్నరప్‌గా నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా, డోర్నకల్ మండలం, ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన తల్లూరి హరి చందన జట్టులో కీలక పాత్ర పోషించారు.
ప్రతిష్టాత్మకమైన ఫెడరేషన్ కప్ జాతీయ త్రోబాల్ పోటీల్లో తెలంగాణ మహిళా జట్టు రన్నరప్‌గా నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంతో తెలంగాణ జట్టు జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుకుంది.
పోటీల్లో మహబూబాబాద్ జిల్లా, డోర్నకల్ మండలం, ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన తల్లూరి హరి చందన జట్టులో కీలక పాత్ర పోషించి పలువురి ప్రశంసలు అందుకున్నారు. ఆమె తన ఏకాగ్రతతో, పట్టుదలతో కూడిన ఆటతీరుతో జట్టుకు అండగా నిలిచారు.
హరి చందన సాధించిన ఈ విజయం ద్వారా తన సొంత గ్రామమైన ఉయ్యాలవాడకు, డోర్నకల్ మండలానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. దివంగత నేత తాల్లూరి బాబు మనవరాలు, ప్రస్తుత కాంగ్రెస్ నాయకులు తాల్లూరి గంగాధర్ కుమార్తె అయిన ఆమె సాధించిన ఈ విజయంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
స్థానిక నాయకులు నున్న రమణ, నజీర్ పాషా, వంకాయలపాటి రామారావుతో పాటు పలువురు ప్రముఖులు ఆమెకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.











