ప్రేమ పేరుతో మహిళా కానిస్టేబుల్‌ను మోసం చేసిన ఎస్సై సురేష్‌ను కూకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే వివాహితుడైన సురేష్, తన భార్యకు విడాకులు ఇస్తానని నమ్మించి, ఆమెతో సన్నిహితంగా ఉన్నట్లు ఆరోపణలున్నాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు.
వివాహితుడైన ఎస్సై సురేష్, అదే పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్‌తో ప్రేమ పేరుతో పరిచయం పెంచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆమెతో శారీరకంగా దగ్గరయ్యాడు. ఈ క్రమంలో మహిళా కానిస్టేబుల్ గర్భవతి అయ్యారు.
గర్భం దాల్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలని మహిళా కానిస్టేబుల్ కోరగా, ఎస్సై సురేష్ నిరాకరించినట్లు సమాచారం. తన భార్యకు విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకుంటానని రెండేళ్లుగా కాలయాపన చేసినట్లు బాధితురాలు ఆరోపించారు. పెళ్లి చేసుకోమని అడిగితే, 'నేను ఎస్సైని, నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటాను?' అని ఎదురుతిరిగాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ మోసాన్ని తట్టుకోలేక, బాధితురాలు ఏప్రిల్ 1న కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే, ఎస్సై సురేష్ తన ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యారు. పోలీసులు నెలన్నర పాటు గాలింపు చర్యలు చేపట్టి, అతన్ని పట్టుకున్నారు.
పోలీసులు ఎస్సై సురేష్‌పై లైంగిక దాడి కేసు నమోదు చేశారు. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ సంఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు. ఎస్సై సురేష్‌ను సస్పెండ్ చేసినట్లు సమాచారం.









