ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి రాష్ట్ర ప్రజలకు, జర్నలిస్టు సోదర సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది జీవితానికి కొత్త దిశను చూపించే ఆరంభమని, గతాన్ని విశ్లేషించుకుని భవిష్యత్తును బాధ్యతతో నిర్మించుకోవాలని ఆయన పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర అత్యంత కీలకమని, ప్రజల సమస్యలను నిస్సంకోచంగా వెలుగులోకి తీసుకురావడంలో జర్నలిస్టులు ముందుండాలని బింగి స్వామి పిలుపునిచ్చారు.
నిజం కోసం పోరాడే ధైర్యం, నిబద్ధత జర్నలిస్టుల ప్రధాన ఆయుధాలని, సమాజంలో మార్పుకు కలం శక్తివంతమైన సాధనమని ఆయన తెలిపారు.
ఈ నూతన సంవత్సరంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా మరింత ముందుకు సాగాలని, ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని, జర్నలిస్టులందరికీ భద్రత, గౌరవం, మంచి అవకాశాలు కలగాలని ఆకాంక్షించారు.












