‘ప్రశ్న ఆయుధం’ దినపత్రిక ఎడిటర్ కాట్యాడ బాపురావు, ఉగాది పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
నూతన సంవత్సరంలో ప్రజాస్వామ్య విలువలు మరింత బలపడాలని, ప్రజల సమస్యలు వేగంగా పరిష్కారం కావాలని ఆయన సందేశంలో పేర్కొన్నారు. సమాజం సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు సాగేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా పాలన సాగితేనే నిజమైన అభివృద్ధి సాధ్యమని బాపురావు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన పాఠకులు, రాష్ట్ర ప్రజలు, అధికారులు, అనధికారులు, ప్రజాప్రతినిధులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
కొత్త సంవత్సరంలో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాధించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.








