ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భూ ఖనిజాభివృద్ధి శాఖ మాజీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు స్వర్గీయ వడ్డేపల్లి నర్సింగరావు 12వ వర్ధంతిని పురస్కరించుకుని కూకట్పల్లిలోని వీఎన్ఆర్ సర్కిల్ వద్ద ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో స్వర్గీయ నర్సింగరావు కుమారుడు, కూకట్పల్లి నియోజకవర్గ బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు పాల్గొని, తన తండ్రి విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వర్గీయ నర్సింగరావు ప్రజాసేవకు అంకితమైన నాయకుడని, ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేశారని గుర్తు చేసుకున్నారు.
రాజకీయాల్లో విలువలు, నిబద్ధతతో ప్రత్యేక గుర్తింపు పొందిన స్వర్గీయ నర్సింగరావు చూపిన సేవా మార్గాన్ని ఆదర్శంగా తీసుకోవాలని యువతకు వడ్డేపల్లి రాజేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆయన జీవితం సమాజ సేవకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఈ వర్ధంతి కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన స్థానిక నాయకులు, అభిమానులు, కాలనీవాసులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. వీరంతా స్వర్గీయ వడ్డేపల్లి నర్సింగరావుకు తమ ప్రగాఢ సంతాపాన్ని, నివాళులను తెలియజేశారు.











