తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి నేడు ఢిల్లీలోని పార్లమెంట్ రాజ్యసభ ప్రాంగణంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సహచర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ, వేం నరేందర్ రెడ్డి రాజ్యసభలో రాష్ట్ర అభివృద్ధి, ప్రజల ఆశయాల సాధనలో సమర్థవంతంగా సేవలందించాలని ఆకాంక్షించారు. ఆయనకు హృదయపూర్వక శుభాభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ ఆయుబ్, టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు తదితరులు కూడా పాల్గొని వేం నరేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు వేం నరేందర్ రెడ్డి ఎన్నిక తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని, రాజ్యసభ వేదికగా రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.








