జిల్లా కలెక్టర్, ఐజీ, ఎస్పీలకు ఆహ్వాన పత్రిక అందజేసిన నిర్మలా జగ్గారెడ్డి

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 30 (ప్రశ్న ఆయుధం న్యూస్): తన కుమార్తె జయారెడ్డి వివాహ మహోత్సవానికి హాజరు కావాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను టీజీఐసీసీ చైర్‌పర్సన్ నిర్మలాజగ్గారెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. అదేవిధంగా సంగారెడ్డికి విచ్చేసిన మల్టీ జోన్-II ఇంచార్జ్ ఐ.జీ. తఫ్సీర్ ఇక్బాల్, సంగారెడ్డి జిల్లా ఎస్పీ సంతోష్ పంకజ్ లకు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఆగస్టు 7న సంగారెడ్డి రామ్ మందిరంలో ఈ వివాహ మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమంలో నాయకులు సంతోష్, కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 

Join WhatsApp

Join Now

Leave a Comment