నిజాంపూర్(కె)లో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం

రాజ్యాంగ
Headlines
  1. నిజాంపూర్ (కె) పాఠశాలలో 75వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
  2. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలన్నం – రాజ్యాంగ దినోత్సవం
  3. విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యాసరచన మరియు డ్రాయింగ్ పోటీలు
  4. రామకృష్ణ ఉపాధ్యాయుడు విద్యార్థులకు రాజ్యాంగ ప్రాముఖ్యత గురించి తెలియజేశారు
  5. నిజాంపూర్ పాఠశాలలో 75వ భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు
సంగారెడ్డి ప్రతినిధి, నవంబరు 26 (ప్రశ్న ఆయుధం న్యూస్): భారత రాజ్యాంగం ఆమోదించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సదాశివపేట మండల పరిధిలోని నిజాంపూర్ (కె) ప్రాథమిక పాఠశాలలో మంగళవారం రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని పూలతో అందంగా అలంకరించారు. ఉపాద్యాయులు, విద్యార్ధులు అంబేడ్కర్ చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఉపాధ్యాయులు విద్యార్థులచే రాజ్యాంగ పీఠికను చదివించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణ విధ్యార్ధులనుద్దేశించి మాట్లాడుతూ.. దేశ పౌరులకు న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను అందిస్తూ రాజ్యాంగాన్ని ఆమోదించి నేటికి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా “భారత రాజ్యాంగ దినోత్సవ” శుభాకాంక్షలు తెలియజేశారు. భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మార్గనిర్ధేశనంలో అందించిన రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలని, అంబేద్కర్ సూచించిన బాటలో నడవాలని, విద్యార్థులందరూ విధ్యాఫలాలు అందుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యాసరచన మరియు డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణతో పాటు ఉపాధ్యాయురాలు సునీత, విద్యార్ధులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now