ఫార్ములా కేసులో ఇక అరెస్టులు..?

ఫార్ములా కేసులో ఇక అరెస్టులు ?

ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో ఇప్పటి వరకూ ఎలాంటి అరెస్టులు చేయలేదు. కానీ గురువారం ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను ప్రశ్నించిన తర్వాత దర్యాప్తు అధికారులు అరెస్టులపై నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేటీఆర్ మౌఖిక ఆదేశాల మేరకే డబ్బు తరలించానని అర్వింద్ కుమార్ చెబుతున్నారు. ఎలాంటి నిబంధనలు పాటించలేదని ఆయన అంగీకరిస్తున్నారు. ఆయన ఈ సమయంలో కేటీఆర్ కు మద్దతుగా మాట్లాడే అవకాశాలు కనిపించడం లేదు. రెండు రోజుల కిందట కూడా ఆయనపై ఓ కేసు నమోదు అయింది.

అరవింద్ కుమార్ ను ప్రశ్నించడం ఇది నాలుగోసారి. లాంఛనమేనని భావిస్తున్నారు. కేటీఆర్ ను గతంలో ప్రశ్నించారు. ఆ సమయంలో ఆయన చెప్పిన వివరాలతో అర్వింద్ కుమార్ ను ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. ఆ వివరాల్లోతేడా ఉంటే తదుపరి చర్యలు తీసుకోనున్నారు. అర్వింద్ కుమార్ విచారణ తర్వాత కేటీఆర్ ను కూడా విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడు విచారణకు పిలిచినా అరెస్టు చేస్తారని కేటీఆర్ కూడా అనుకుంటున్నారు. ఏం పీకలేరని మహా అయితే ఓ పదిహేను రోజులు జైల్లో పెట్టగలరని కేటీఆర్ లైట్ తీసుకుంటున్నారు.

ఈ క్రమంలో కేటీఆర్ ను అరెస్టు చేస్తారా లేదా అన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. విదేశీ కంపెనీ ఖాతాకు మళ్లించిన డబ్బు మళ్లీ ఎవరికి చేరింది.. స్పాన్సర్ షిప్ విరమించుకున్న కంపెనీ.. బీఆర్ఎస్ ఎందుకు యాభై కోట్ల ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చింది అన్న అంశాలపై స్పష్టత వస్తే.. దర్యాప్తు అధికారులు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడ యాభై కోట్లు దేశం దాటిపోయాయన్నది కళ్ల ముందు ఉన్న నిజం కాబట్టి.. ఎలాంటి చర్య తీసుకున్నా.. డిఫెండ్ చేసుకోవడం కేటీఆర్ కు కష్టమవుతుందన్న అంచనా ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment