సామాన్యులకే కాదు, పెట్రోలింగ్ పోలీసులకూ గుంతల వలలో ప్రమాదం..!

చూచి చూడకపోతే అంతే సంగతి!

కలెక్టర్ కార్యాలయానికి కూతవేటు దూరంలో గుంతల మయం జయశంకర్ కాలనీ..!

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయనికి కూతవేటు దూరం..!

సామాన్యులకే కాదు, పెట్రోలింగ్ పోలీసులకూ గుంతల వలలో ప్రమాదం..!

మూడు రోజుల వర్షానికే రోడ్లు గోతుల దిబ్బలా మారిన పరిస్థితి..!

కాలనీకి వెళ్లని అధికారులు, పాదం పెట్టని రాజకీయ నాయకులు..!

తాగునీటి కొరతతో మిషన్ భగీరథ సైతం విఫలం..!

ప్రశ్న ఆయుధం ఆగష్టు 29కామారెడ్డి:

మూడురోజుల వర్షానికి కామారెడ్డి జయశంకర్ కాలనీ గుంతల మయంగా మారింది. కలెక్టర్ కార్యాలయానికే దగ్గరగా ఉన్న ఈ కాలనీలో పాదం మోపితే ఏ క్షణానా ప్రమాదం అన్న భయం కూర్చుకుంది. గుంతలు రాత్రివేళల్లో మరింత సవాలు విసురుతున్నాయి. పోలీసుల పెట్రోలింగ్ వాహనాలు సైతం ఏ గుంతలో ఎప్పుడు దూకుతాయో తెలియని స్థితి.అయినా ఇప్పటివరకు ఆ కాలనీని చూసిన అధికారి లేరు, పాదం పెట్టిన రాజకీయ నాయకులు లేరు, స్పందించిన మున్సిపల్ అధికారులు లేరు. కాలనీవాసులు నిత్యం కష్టాల్లోనే నడుస్తున్నారు.ఇక తాగునీటి సమస్య మరింత మింగేసింది. మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు .కాలనీ ప్రజలు స్పష్టంగా చెబుతున్నారు – “ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరవాలి, గుంతల మయం అయిన రోడ్లు సరిచేయాలి, నీటి సమస్యను పరిష్కరించాలి” అని. లేకపోతే ఈ కాలనీ సమస్యలు కళ్ళముందేపెరిగిపోతాయన్నది వాస్తవం.

Join WhatsApp

Join Now

Leave a Comment