సంగారెడ్డి/అమీన్ పూర్,ఆగస్టు 4 (ప్రశ్న ఆయుధం న్యూస్): స్నేహానికి మించినది ఏది లేదని ముఖ్య అతిథి జోన్ చైర్మన్ లయన్ మంగలపర్తి వెంకటేశం తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అమీన్ పూర్ ఆధ్వర్యంలో లయన్ బి.కృష్ణగౌడ్ అధ్యక్షతన ఫ్రెండ్ షిప్ డేను బృందావన్ టీచర్స్ కాలనీలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన ఆత్మీయ సమావేశంలో లయన్ సభ్యుల ఇతర ఆత్మీయ మిత్రులతో సంతోషాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం అమీన్ పూర్ స్వచ్చభారత్ (పారిశుధ్య) టీం ఈ కార్యక్రమంలో పాల్గొని, వారు నిర్వహించే తడి చెత్త, పొడిచేత్త, పారిశుద్ధ్య కార్యక్రమంలో క్లబ్ ముఖ్య పాత్ర వహిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి జోన్ చైర్మన్ లయన్ మంగళపర్తి వెంకటేశంతో పాటు కాలనీ అధ్యక్షుడు లయన్ జి.యం.టి.చైర్మన్ పట్నం సురేందర్, క్లబ్ కార్యదర్శి కే.నాగరాజు, కోశాధికారి కే.సిద్దిరాములు, ఉపాధ్యక్షుడు రామనరసింహరెడ్డి, అమీన్ పూర్ పురపాలక బృందం పావని, శశిధర్, అంజనీ కుమార్, కాలనీ దేవాలయ కమీటి చైర్మన్ లయన్ జె.ప్రబాకర్, సభ్యులు నాగేశ్వర్ రావు, లింగం, ఆంజనేయులు, కాశీనాథ్, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
స్నేహానికి మించినది ఏది లేదు: లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ మంగలపర్తి వెంకటేశం
Published On: August 4, 2024 4:32 pm