అంగన్ వాడిల్లో 15, 274 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్..!
హైదరాబాద్:సెప్టెంబర్ 16
తెలంగాణలోని అంగన్ వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 15,274 ఉద్యోగా లను భర్తీ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నియామక విధానంలో మార్పులు తీసుకురావడానికి ఇతర రాష్ట్రాల విధానాలను అధ్యయనం చేస్తున్నారు. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసి, ఖాళీలను భర్తీ చేయనున్నారు,
దీని ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో సేవలు మెరుగు పడతాయి. అంగన్వాడీల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం కసర త్తు ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా పదోన్నతులు, ఉద్యోగ విరమణతో ఏర్పడి న ఖాళీల వివరాలను సేకరించింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 15,274 ఖాళీలు ఉన్నట్లు లెక్కతేలింది.
నియామక విధానంలో అవసరమైన మార్పులు చేసేందుకు సర్కార్ దృష్టి సారించింది. ఈ ప్రక్రియ పూర్తికాగానే ఉద్యోగ నియా మకాలకు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.