సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 13 (ప్రశ్న ఆయుధం న్యూస్): జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 38 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి అర్జీపై తక్షణ చర్యలు తీసుకుని సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే ప్రజల ప్రధాన సమస్యలపై పూర్తి దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
Published On: October 13, 2025 6:38 pm