ఆపరేషన్ సక్సెస్ – పేషంట్ డెడ్ రేవంత్ ఫార్ములా ఇదే: ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

సంగారెడ్డి, అక్టోబర్ 9 (ప్రశ్న ఆయుధం న్యూస్): స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడైనా ప్రకటించినా, పార్టీ కార్యకర్తలు పూర్తిగా సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పిలుపునిచ్చారు. సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం మండల, గ్రామ స్థాయి బీఆర్ఎస్ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తాజా రాజకీయ పరిణామాలపై నేతలతో చర్చించి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలాన్ని మరింతగా పెంచే విధంగా వ్యూహరచన చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాల్లో పార్టీ పరంగా బలమైన అభ్యర్థులను ఎంపిక చేసి, వారిని గెలిపించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు. జడ్పీలను కూడా పార్టీ ఆధీనంలోకి తీసుకునే దిశగా కట్టుదిట్టమైన వ్యూహం అవలంబించాలని ఆదేశించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్థానిక సంస్థల నిర్వహణలో చూపిస్తున్న విధానం ఆపరేషన్ సక్సెస్ – పేషెంట్ డెడ్ ఫార్ములానే అని, ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కంది మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment