అనాధ గిరిజన బాలిక మాలినిని ఆదుకోవాలి: విశ్రాంత మండల విద్యాధికారి, న్యాయవాది డి.అంజయ్య

సంగారెడ్డి/కంది, అక్టోబర్ 9 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని కోయిలగూడ తండాకు చెందిన అనాధ గిరిజన బాలిక మాలినిని ఆదుకోవాలని విశ్రాంత మండల విద్యాధికారి, న్యాయవాది డి.అంజయ్య కోరారు. గురువారం కోయిలగూడ తండాలో బాదావత్ మాలిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అంజయ్య మాట్లాడుతూ.. 11 సంవత్సరాలు బాదావత్ మాలిని పుట్టిన నాలుగు నెలలకు తల్లి శోభ చనిపోయిందని అన్నారు. నాయనమ్మ లక్ష్మి మాలినిని చూసుకునేదని, ఐదు సంవత్సరాల క్రితం నాయనమ్మ చనిపోయిందని తెలిపారు. తండ్రి ఉన్న లేనట్లే అని, ఆయన మాలినిని గురించి పట్టించుకోడని, కనీసం కొన్ని నెలల వరకు తండాకు రాడని అన్నారు. చుట్టుపక్క వాళ్ళు దయ తలచి అన్నం పెడితే ఆ రోజు పూట గడుస్తుందని, లేదంటే పస్తులు ఉండ వలసి వస్తుందని అన్నారు. ఏ సమయంలో మాలినికి ఏమి జరుగుతుందో అని చుట్టుపక్కల వాళ్ళు భయపడుతున్నారని అన్నారు. ముందుగా మాలినికి రక్షణ, వసతి కల్పించాలని అన్నారు. అదేవిధంగా చదువు నేర్పించాలని, మాలినికి కనీసం బర్త్ సర్టిఫికెట్ లేదని, ఆధార్ కార్డు లేదని తెలిపారు. దయచేసి సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఏదైనా గురుకుల పాఠశాలలో లేదా కే.జీ.బీ.వీ. పాఠశాలలో చేర్పించి ఆమెకు రక్షణ, వసతి, కల్పించి, చదువు నేర్పించాలని విజ్ఞప్తి అంజయ్య కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment