హైదారాబాద్, ఫిబ్రవరి 21 (ప్రశ్న ఆయుధం న్యూస్): జాతీయ స్థాయిలో మైనార్టీల హక్కుల సాధన కోసం ఐక్య ఉద్యమాలు అవసరం అని పద్మశ్రీ మందకృష్ణ మాదిగ సూచించారు. భారత్ మైనారిటీస్ రైట్స్ ప్రొటక్షన్ ఫోరం క్రియా శీలక పాత్ర పోషించాలని ఆయన అన్నారు. శుక్రవారం హైద్రాబాద్ లోని లక్డీక పూల్ సెంట్రల్ కోర్టు హోటల్ లో బీఎంఆర్ పీఎఫ్ లోగోను లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. ప్రజాస్వామిక శక్తుల సమూహాలు బలమైన ఉద్యమాలు నిర్మించాలని ఆయన కోరారు. భవిష్యత్ తరాలకు దిశా నిర్దేశం ఇవ్వాలని అయన పిలుపు నిచ్చారు. మైనార్టీల హక్కుల సాధన కోసం ఐక్యంగా పనిచేసి హక్కులను సాధించుకుందామని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్, మైనార్టీ సంఘాల ఐక్య వేదిక జాతీయ నాయకులు సయ్యద్ ఇస్మాయిల్, మైనార్టీ అధ్యయన వేదిక కన్వీనర్ ఆసిఫ్ హుస్సైన్, మైనార్టీ సంఘాల నాయకులు ఫక్రుద్దీన్, అసాద్, పర్వేజ్, అబూబకర్ తదితరులు పాల్గొన్నారు.
మైనార్టీల హక్కుల సాధన బీఎంఆర్ పీఎఫ్ బాధ్యత: లోగో ఆవిష్కరణలో పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ
Updated On: February 21, 2025 10:05 pm
