నూతన ప్రజాప్రతినిధులకు పద్మశాలి సంఘం ఘన సన్మానం

నూతన ప్రజాప్రతినిధులకు పద్మశాలి సంఘం ఘన సన్మానం

కలవరాల్ గ్రామ సర్పంచ్ క్యామ నరేందర్‌, ఉపసర్పంచ్ కుంట గంగన్నతో పాటు వార్డ్ సభ్యులకు సన్మాన కార్యక్రమం

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం డిసెంబర్ 21

కలవరాలు గ్రామంలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు పద్మశాలి సంఘం కలవరాల్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం పద్మశాలి సంఘం కలవరాల్ భవనంలో జరిగింది.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కలవరాల్ గ్రామ సర్పంచ్ క్యామ నరేందర్‌ గారిని, ఉపసర్పంచ్ కుంట గంగన్న గారిని, 8వ వార్డు సభ్యుడు జోరిగల రాజశేఖర్‌ గారిని, 2వ వార్డు సభ్యురాలు జోరిగల పల్లవి గారిని పద్మశాలి సంఘం కార్యవర్గ సభ్యులు, సంఘ సభ్యులు, గ్రామ పెద్దలు సమక్షంలో ఘనంగా సన్మానించారు.

గ్రామ అభివృద్ధికి ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఈ సందర్భంగా పలువురు వక్తలు ఆకాంక్షించారు. నూతన ప్రజాప్రతినిధులు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, గ్రామ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు, సభ్యులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

జై మార్కండేయ… జై జై మార్కండేయ…

జై హింద్

Join WhatsApp

Join Now

Leave a Comment