ఈ నెల 20న మెదక్ లో తిరంగా యాత్ర:* *బీజేపీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాపగారి రమేష్ గౌడ్

మెదక్/నర్సాపూర్, మే 17 (ప్రశ్న ఆయుధం న్యూస్): భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 20న మెదక్ లోని రామాలయం నుండి మున్సిపల్ భవనం వరకు తిరంగా యాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీజేపీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాపగారి రమేష్ గౌడ్ తెలిపారు. శనివారం వెల్దుర్తిలో విలేకరులతో మాట్లాడుతూ.. ఈనెల 20న మెదక్ లోని రామాలయం నుండి మున్సిపల్ భవనం వరకు తిరంగా యాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ యాత్రలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు శ్రీనివాస్ గౌడ్, శేఖర్ గౌడ్, మండల అధ్యక్షుడు పడిగె దాసు, జిఎస్.మల్లేష్ గౌడ్, ఉపాధ్యక్షులు బాలకిషన్, నర్సింలు, మాజీ ఉప సర్పంచ్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now