సంగారెడ్డి/సదాశివపేట మార్చి 15 (ప్రశ్న ఆయుధం న్యూస్): విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశానుసారం సదాశివపేట మండలం నిజాంపూర్(కె) ప్రాథమిక పాఠశాలలో శనివారం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ మీనా అధ్యక్షతన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. విద్యార్థులు వారికి నచ్చిన మరియు వారు కలలు కనే వృత్తులకు సంబంధించిన దుస్తులను ధరించి కొందరు, నచ్చిన జంతువుల ముఖాలను సూచించే మాస్కులు ధరించి మరికొందరు విద్యార్థులు పాఠశాలకు వచ్చారు. సమావేశంలో విద్యార్థులు పుస్తక పఠనాన్ని మరియు స్కిట్ లను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. తల్లిదండ్రులు ఇంటి వద్ద తమ పిల్లల అభిరుచిని ఇష్టాన్ని తెలుసుకొని వారిని ఆయా రంగాల్లో ప్రోత్సహించాలని, అభినందించాలని విన్నవించారు. అదేవిధంగా తమ పిల్లలని వేరే పిల్లలతో పోల్చవద్దని, ఎవరి గొప్పతనం వారికి ఉంటుందని అన్నారు. మరియు విద్యార్థుల ప్రగతిని తెలియజేశారు. అనంతరం తల్లిదండ్రుల యొక్క అభిప్రాయాలను సేకరించారు.ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ ఎర్ర మీనా, ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణ, ఉపాధ్యాయులు నవనీత, సునీత, విద్యార్థులు పాల్గొన్నారు.
నిజాంపూర్ (కె) పాఠశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం
Published On: March 16, 2025 9:49 am
