సంగారెడ్డి ప్రతినిధి, మే 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): జిల్లా వ్యాప్తంగా అన్నీ నీట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. గురువారం సంగారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల, జె.ఎన్.టి.యు, ఐఐటి, కెవి-స్కూల్ ఓడియఫ్ పరీక్ష కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ.. ఈ నెల 4వ తేదీ ఆదివారం జరగనున్న నీట్ పరీక్ష దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లను చేసినట్లు వివరించారు. జిల్లాలో మొత్తం 7 పరీక్ష కేంద్రాలలో 3320 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని, మధ్యాహ్నం 2 – 5 గంటల వరకు జరగనున్న ఈ పరీక్ష కేంద్రంలోనికి ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు మాత్రమే అభ్యర్థులను అనుమతించడం జరుగుతుందని అన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 125 బి.యన్.యస్.యస్, (144) సెక్షన్ అమలులో ఉంటుందని, సెంటర్ల వద్ద గుంపులు, గుంపులుగా తిరగడ్డానికి వీలులేదు అన్నారు. అభ్యర్థులు, ఇన్విజిలేటర్స్ ఎవ్వరూ ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రాలలోనికి తీసుకురాకూడదని, పరీక్ష కేంద్రం సిసి కెమెరాల పర్యాయవేక్షణలో ఉంటుందని ఎస్పీ గుర్తు చేశారు.
*అభ్యర్థులకు సూచనలు:*
• అభ్యర్థులు అడ్మిట్ కార్డ్ తో పాటు గుర్తింపు కార్డ్, పాస్ ఫోటో సైజ్ ఫోటోలు-2, పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో-1, పారదర్శకంగా/ ట్రాన్స్పరెంట్ గా ఉండే వాటర్ బాటిల్ తీసుకొని రావాలి.
• బంగారు, వెండి తదితర నగలు వేసుకొని రాకూడదు. షూస్, సాక్స్ వేసుకొని రాకూడదు. అడ్మిట్ కార్డ్ నందున్న సూచనలు పాటిస్తూ.. పరీక్ష కేంద్రాలకు సకాలంలో హాజరు కావాలని జిల్లా ఎస్పీ గారు అభ్యర్థులు సూచనలు చేశారు. వీరి వెంట సంగారెడ్డి డీయస్పీ సత్యయ్య గౌడ్, జోగిపేట్ సీఐ అనిల్ కుమార్, సంగారెడ్డి రూరల్ క్రాంతికుమార్ తదితరులు ఉన్నారు.