సైబర్ నేరాలపై సంగారెడ్డి జిల్లా పోలీసుల ప్రత్యేక నిఘా: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 14 (ప్రశ్న ఆయుధం న్యూస్): సైబర్ నేరాలపై సంగారెడ్డి జిల్లా పోలీసుల ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఆన్‌లైన్ ఫ్రెండ్ యాప్ ద్వారా పరిచయం ఏర్పరుచుకొని, బాధితుడి నుండి భారీగా డబ్బులు వసూలు చేసి ఫేక్ డీపీ (నకిలీ ప్రొఫైల్) ద్వారా సైబర్ మోసాలకు పాల్పడుతున్న నిందితున్ని సంగారెడ్డి జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకుని రూ 3,63,000/-, ఒక సెల్ ఫోన్ స్వాధీనం, జుడీషియల్ రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. సంగారెడ్డి జిల్లా సెంట్రల్ క్రైమ్ పోలీస్, హత్నూర పోలీస్ మరియు డిస్ట్రిక్ట్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (డి4సి) సంయుక్త ఆపరేషన్ లో కీలక నిందితుడి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. బాధితుడు హత్నూర మండలానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి. ఆగస్టు 1వ తేదీన సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదు ప్రకారం హత్నూర పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయగా.. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశానుసారం తదుపరి విచారణ చేపట్టిన సెంట్రల్ క్రైమ్ పోలీసులకు ఈ సంవత్సరం జనవరి నుండి ఏప్రిల్ మద్యకాలంలో “డక్ చాట్ క్లబ్ యాప్ (డక్ చాట్ క్లబ్ యాప్)” అనే మొబైల్ అప్లికేషన్ ద్వారా అమ్మాయిగా నకిలీ ప్రొఫైల్ తో పరిచయమైన సైబర్ నేరగాడు ప్రేమ పేరుతో మోసం చేస్తూ, బెదిరింపులకు గురి చేస్తూ బాధితుని వద్ద నుండి రూ. 10,33,000/- (పది లక్షల ముప్పై మూడు వేల రూపాయలు) యూపీఐ ద్వారా బదిలీ చేయించాడు. విచారణ ప్రారంభించిన సిసిఎస్ బృందం టెక్నికల్ సాక్ష్యాల ఆధారంగా నిందితుడు సీలం సంజయ్ కుమార్ ను అరెస్ట్ చేయగా, ఇతనికి సహకరించిన మరో నిందితుడు పరారిలో ఉన్నాడు. ఆన్‌లైన్‌లో అపరిచిత వ్యక్తులతో స్నేహాలకు దూరంగా ఉండాలని, ధన లావాదేవీలు చేయడం, లేదా నమ్మకం ఉంచడం వంటి చర్యలు మోసాలకు దారి తీయవచ్చని గ్రహించాలని అన్నారు. ఎవరైన ఆన్‌లైన్ మోసం/అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్‌ 1930 కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ కేసు చేదనలో కీలకంగా వ్యవహరించిన ఎన్.వేణుగోపాల్ రెడ్డి (డీఎస్పీ – డి4డి సంగారెడ్డి), వి.శివకుమార్ (సిసిఎస్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్), మొహమ్మద్ నయీం ఉద్దీన్ (సర్కిల్ ఇన్‌స్పెక్టర్, జిన్నారం), పి.రామునాయుడు (సిసిఎస్ ఇన్‌స్పెక్టర్), కె.శ్రీకాంత్ (ఎస్‌ఐపి, సిసిఎస్ సంగారెడ్డి), సిసిఎస్, డి4డి, మరియు హత్నూర పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఎస్పీ ప్రశంసించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment