*ట్రాన్స్ జెండర్స్ కు అవగాహన*
సంగారెడ్డి/పటాన్ చెరు, ఆగస్టు 16 (ప్రశ్న ఆయుధం న్యూస్): ట్రాన్స్ జెండర్స్ ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడొద్దని, వాటికి దూరంగా ఉండాలని పటాన్ చెరు సీఐ ప్రవీణ్ రెడ్డి సూచించారు. పటాన్ చెరు పారిశ్రామిక వాడలో గత కొంతకాలంగా ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డు, ఇతర రహదారుల పక్కన ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు పటాన్ చెరు పోలీసులకు దృష్టికి రావడంతో మండలంలోని ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో గల హోటల్స్ రహదారుల పక్కన వచ్చిపోయే పాదాచారులకు ఇబ్బంది కలిగించే విధంగా చేస్తుండడంతో పటాన్ చెరు పోలీసులు పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. ఈ సందర్భంగా సీఐ ప్రవీణ్ రెడ్డి వారికి అవగాహన కల్పించారు. అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉంటూ జనజీవన స్రవంతిలో మంచి నడవడిక పెంపొందించుకునేలా ఉత్తమ వ్యక్తులుగా జీవించాలన్నారు. గాంజా, డ్రగ్స్ ఇతర దురు వ్యసనాలకు సమాజంలో మంచి నడవడికతో గుర్తింపు తెచ్చుకునేలా ఉండాలని సూచించారు.