మూడు మున్సిపాలిటీలకు రూ.45 కోట్ల నిధులు మంజూరు: పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్

సంగారెడ్డి/పటాన్‌చెరు, అక్టోబర్ 23 (ప్రశ్న ఆయుధం న్యూస్): పటాన్‌చెరు నియోజకవర్గంలోని గుమ్మడిదల, ఇస్నాపూర్, గడ్డపోతారం మున్సిపాలిటీలకు ఒక్కో మున్సిపాలిటీకి రూ.15 కోట్లు చొప్పున మొత్తం రూ.45 కోట్ల నిధులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, కార్మిక, ఉపాధి, గనులు శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిలకు పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. గురువారం కాట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఈ నిధులు మున్సిపాలిటీలలో రహదారులు, డ్రైనేజీ, పారిశుద్ధ్య సదుపాయాలు, వీధి లైటింగ్ మరియు ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి వినియోగించబడతాయని ఆయన తెలిపారు. పటాన్‌చెరు ప్రజల ఎన్నేళ్ల అభివృద్ధి ఆకాంక్షలను నెరవేర్చిందని పేర్కొన్నారు. ప్రజాహిత దృష్టితో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పటాన్‌చెరు ప్రాంత సమగ్రాభివృద్ధికి దోహదం చేస్తుందని కాట శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment