*ఫసల్ వాదిలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు*
*విద్యార్థులకు బహుమతులు అందజేసిన పట్నం నిర్మలాదేవి*
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 15 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి మండలం ఫసల్ వాది గ్రామ జడ్పీహెచ్ ఎస్ పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలలో 2023-24 సంవత్సరం లోని సంగారెడ్డి జిల్లా స్థాయిలో ఎస్ఎస్ సీ లో 9.5, 9.3, 9.2 మార్క్స్ సాధించిన విద్యార్థులకు పట్నం మాణిక్యం ఫౌండేషన్ తరపున మొదటి బహుమతి 8వేలు, రెండవ బహుమతి 6వేలు, మూడవ బహుమతి 5వేలు మొత్తం 6 మంది విద్యార్థులకు ఫసల్ వాది గ్రామ మాజీ సర్పంచ్ పట్నం నిర్మలా దేవి నగదుతో పాటు స్వీట్ బాక్స్ అందజేశారు. అనంతరం పట్నం నిర్మలాదేవి మాట్లాడుతూ.. పట్నం మాణిక్యం ఫౌండేషన్ ప్రతి పేద కుటుంబాలకు,విద్యార్థులకు అండగా నిలుస్తుందని, ప్రతి విద్యార్థి కూడా ఈ విద్యార్థులను ఆదర్శంగా తీసుకొని చదువులో రాణించి గ్రామానికి, పాఠశాలకు మంచి పేరు సంపాదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు, గ్రామ యువత పాల్గొన్నారు.