పుల్కల్ లో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా పట్టివేత

IMG 20251008 WA0073సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 8 (ప్రశ్నయుధం ప్రతినిధి): విశ్వసనీయమైన సమాచారం మేరకు పుల్కల్ పోలీస్ సిబ్బంది రాత్రి 10గంటల సమయంలో దాడి నిర్వహించారు. ఈ దాడిలో జీజే 03 బీవీ 2175 నంబర్ గల లారీని ఆపి తనిఖీ చేయగా.. అందులో ప్రభుత్వ పీడీఎస్ బియ్యం (సన్నబియ్యం) ఫోర్టిఫైడ్ కర్నల్స్‌తో కలిపి ఉన్నట్లు గుర్తించారు. అనంతరం పరిశీలనలో 594 ప్లాస్టిక్ సంచుల్లో సుమారు 292 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం శంషాబాద్ ప్రాంతం నుండి గుజరాత్ రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్నట్లు తేలింది. ఈ చర్యలో స్థానిక డీటీసీఎస్ శ్రీ షాజియుద్దీన్ పంచనామా నిర్వహించి, లారీ డ్రైవర్ రాజక్ భాయ్, లారీ యజమాని హిరెన్ లపై పుల్కల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేశారు. స్వాధీనం చేసిన పీడీఎస్ బియ్యాన్ని ఎంఎల్‌ఎస్ పాయింట్ సదాశివపేటకు తరలించగా, లారీని పుల్కల్ పోలీస్ స్టేషన్ లో భద్ర పరిచారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అక్రమంగా ప్రభుత్వ బియ్యాన్ని తరలించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment