ప్రజలు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి –

*నిజామాబాద్ ప్రజలు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి – పోలీస్ కమిషనర్ హెచ్చరిక*

 

నిజామాబాద్, జిల్లా ప్రతినిధి,నవంబర్ 1 (ప్రశ్న ఆయుధం)

 

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం నుండి ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా ముఖ్యమైన ఆదేశాలు జారీ అయ్యాయి. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ ఈ నిబంధనలు తేది: 01-11-2025 నుండి 15-11-2025 వరకు అమలులో ఉంటాయని తెలిపారు. ప్రజలు తప్పనిసరిగా ఈ సూచనలను పాటించాలని ఆయన హెచ్చరించారు.

1) విగ్రహాల ప్రతిష్టాపనపై నిబంధనలు—–

జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రదేశాలు, పార్కులు, ఐలాండ్లు, ప్రభుత్వ భవనాల వద్ద విగ్రహాలను ప్రతిష్టించరాదు. విగ్రహాల ప్రతిష్టాపనకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ అనుమతి తప్పనిసరి.

–2) శబ్ద కాలుష్యం నియంత్రణ

రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు డీజేలు, లౌడ్‌స్పీకర్లు వాడటం పూర్తిగా నిషేధం. రెసిడెన్షియల్ మరియు కమర్షియల్ ప్రాంతాల్లో 55 డెసిబెల్స్‌కి మించి శబ్దం ఉత్పత్తి చేయరాదు. శబ్ద పరికరాల వినియోగానికి పోలీస్ అనుమతి తప్పనిసరి.


3) ఊరేగింపులు, సభల నిర్వహణ

నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో డీజేలు, అధిక శబ్ద సౌండ్ సిస్టమ్స్‌ వినియోగం నిషేధం.

500 మందికి లోపు జరిగే సభలకు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అనుమతి అవసరం.

500 మందికి మించిన కార్యక్రమాలకు పోలీస్ కమిషనర్ అనుమతి తప్పనిసరిగా 72 గంటల ముందు తీసుకోవాలి.


4) సార్వజనిక ప్రదేశాల్లో నియమాలు

మాల్స్, సినిమా థియేటర్లు, హోటళ్లు, ఎగ్జిబిషన్లు, వ్యాపార ప్రదేశాల్లో భద్రతా చర్యలు కచ్చితంగా అమలు చేయాలి. ప్రజలు క్యూ విధానాన్ని తప్పనిసరిగా పాటించాలి.

5) డ్రోన్ల వినియోగంపై ఆంక్షలు

డ్రోన్ల వినియోగం వలన ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున వాటిని నియంత్రించేందుకు చర్యలు చేపట్టారు. డ్రోన్ల వాడకానికి పోలీస్, ఏవియేషన్ మరియు సంబంధిత ప్రభుత్వ శాఖల క్లియరెన్స్ తప్పనిసరి.

6) నకిలీ గల్ఫ్ ఏజెంట్లపై అప్రమత్తంగా ఉండాలి

నకిలీ గల్ఫ్ ఏజెంట్లు మోసపూరిత కార్యకలాపాలు చేస్తున్నారని పోలీసులు హెచ్చరించారు. ప్రజలు తమ ఇళ్లను అద్దెకు ఇవ్వడానికి ముందు సంబంధిత పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలి. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

7) “A” సర్టిఫికెట్ సినిమాల వీక్షణం

“A” సర్టిఫికెట్ పొందిన సినిమాలను మైనర్లు థియేటర్లలో వీక్షించేందుకు అనుమతించరాదు. థియేటర్ యాజమాన్యాలు ఈ నిబంధనను తప్పనిసరిగా పాటించాలి.

8) బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై నిషేధం

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం ప్రజా ప్రశాంతతకు విఘాతం కలిగిస్తుందని కమిషనర్ తెలిపారు. రోడ్లపై లేదా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.—

ముఖ్య గమనిక

ఈ ఆదేశాలను అతిక్రమించిన వారికి సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్‌ల పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలు / ఎస్‌ఐలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని కమిషనర్ పిలుపునిచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment