*ప్రజలకు సీజనల్‌ వ్యాధులపై అవగాహన కల్పించాలి:* *మెదక్ డీఎం అండ్ హెచ్ఓ శ్రీరామ్*

మెదక్/నర్సాపూర్, ఆగస్టు 6 (ప్రశ్న ఆయుధం న్యూస్): గ్రామాల్లో జ్వరాల సర్వే నిర్వహించి, సీజనల్‌ వ్యాధులపై అవగాహన కల్పించాలని డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ శ్రీరామ్ తెలిపారు. మంగళవారం నాడు నర్సాపూర్ లోని డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓ కార్యాలయంలో డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ సృజన ఆధ్వర్యంలో వైద్యాధికారులు, సూపర్‌వైజర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎం అండ్ హెచ్ఓ శ్రీరామ్ మాట్లాడుతూ.. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండే విధంగా అవగాహన కల్పించాలని తెలిపారు. మలేరియా, డెంగ్యూ మరియు టైఫాయిడ్ జ్వరం వంటి వ్యాధులపై ప్రజలకు పలు సలహాలు సూచనలు ఇవ్వాలని తెలిపారు. గ్రామాలలో పరిశుభ్రత పాటించే విధంగా చర్యలు తీసుకునేలా చూడాలని అన్నారు. ఇండ్ల చుట్టుపక్కల నీరు నిలవకుండా ఉండేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలితే వెంటనే వైద్య క్యాంపులు ఏర్పాటు చేయాలని వారు తెలిపారు. గ్రామాల్లో వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓ సృజనతో పాటు డీఐఓ డాక్టర్ మాధురి, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నవీన్, డాక్టర్లు రమేష్, ప్రవీణ్, రఘువరన్, పవన్, సాయి సౌమ్య, ఫౌజియా, ఫర్నాజ్, హెల్త్ సూపర్ వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now