రక్తదానం చేసే వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువ

రక్తదానం చేసే వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువ

 

ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్‌క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు

 

ప్రశ్న ఆయుధం

కామారెడ్డి జిల్లా అక్టోబర్‌ 22:

 

కామారెడ్డి పట్టణం పరిధిలోని ప్రైవేటు ఆసుపత్రిలో అనీమియా వ్యాధితో బాధపడుతున్న మంజుల అనే మహిళకు అత్యవసరంగా బీ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో, సింగరాయపల్లి గ్రామానికి చెందిన అన్నేబోయిన ప్రశాంత్ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి సకాలంలో రక్తాన్ని అందజేశారు. దీంతో ప్రశాంత్ ప్రాణదాతగా నిలిచారని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్‌క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు.

ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ, రక్తదానం పట్ల ప్రతి ఒక్కరిలో అవగాహన పెంపొందాలని సూచించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వే ప్రకారం రక్తదానం చేసే వారికి గుండె జబ్బులు, క్యాన్సర్‌, కొలెస్ట్రాల్‌ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని వివరించారు.

రక్తదానం చేయడం అంటే తోటి మనుషుల ప్రాణాలను కాపాడడమే కాకుండా, మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవడమేనని తెలిపారు.అనంతరం రక్తదాత ప్రశాంత్‌ను అభినందించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment