అనంతారంలో పోచమ్మ తల్లి ఆలయ ధ్వారబంధాల ప్రతిష్టాపన

సంగారెడ్డి/పటాన్ చెరు, జూలై 3 (ప్రశ్న ఆయుధం న్యూస్): గుమ్మడిదల మండలంలోని అనంతారం గ్రామం ఎస్సీ కాలనీలో నిర్మిస్తున్న శ్రీ పోచమ్మ తల్లి ఆలయ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఆలయానికి ధ్వారబంధాలు (గడప) ఏర్పాటు కార్యక్రమం గుమ్మడిదల మాజీ సర్పంచ్ చిమ్ముల లలిత నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి సహాయంతో చేపట్టారు. ఆలయ నిర్మాణానికి ఆయన అందిస్తున్న సహాయాన్ని గ్రామస్థులు, కాలనీవాసులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి కుమార్ గౌడ్, మాజీ సర్పంచ్ దీపా నరేందర్ రెడ్డి, కొమ్ము కిష్టయ్య, గ్రామ పెద్దలు సురేష్,లక్ష్మణ్, యాదిరెడ్డి, గోపాల్, రమణ,మహేష్ యాదవ్,భాస్కర్ గౌడ్, సాయి గౌడ్, యాదయ్య, శ్రీకాంత్, ప్రభాకర్, ప్రవీణ్, అశోక్, బాల్ నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment