కీసర లో పోలీస్ తనిఖీలు: వర్షాన్ని సైతం లెక్క చేయని సిబ్బంది

IMG 20250718 WA0522

*కీసర లో పోలీస్ తనిఖీలు: వర్షాన్ని సైతం లెక్క చేయని సిబ్బంది!*

మేడ్చల్ జిల్లా కీసర ప్రశ్న ఆయుధం జూలై 18

రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ ఆదేశాల మేరకు, కమిషనరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం నాకాబందీ (వాహనాల తనిఖీ) నిర్వహించారు. ఈ సందర్భంగా కీసర ప్రాంతంలోని చెక్‌పోస్టును ఎస్ఓటీ డీసీపీ రమణ రెడ్డి సందర్శించారు.
తనిఖీల్లో పాల్గొంటున్న పోలీసు సిబ్బందిని డీసీపీ రమణ రెడ్డి పలు ప్రశ్నలు అడిగి, వారి విధి నిర్వహణ తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. వాహన తనిఖీల అనంతరం వివరాలను రికార్డుల్లో నమోదు చేస్తున్నారా లేదా అని పరిశీలించారు.
కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్‌స్పెక్టర్ సి.ఐ. శ్రీనివాస్ నేతృత్వంలో ఈ తనిఖీలు జరిగాయి. వర్షం కురుస్తున్నప్పటికీ, పోలీసులు తమ విధులను విస్మరించకుండా ప్రతి వాహనాన్ని ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేసి, వాహనదారులకు అవసరమైన సూచనలు చేశారు. ఈ తనిఖీల్లో కార్లు, ద్విచక్ర వాహనాలతో పాటు అనుమానాస్పద వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఇటువంటి తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment