ఆంధ్రప్రదేశ్ కు అమరావతి శాశ్వత రాజధానిగా కొనసాగుతుందని పార్లమెంట్ ఆమోదం తెలపడంతో, అనంతపురంలో "జయహో అమరావతి" పేరుతో విజయోత్సవ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఈ ర్యాలీలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపడంతో, అమరావతిని రాజధానిగా కొనసాగించాలనే నిర్ణయానికి ప్రజల నుంచి లభించిన మద్దతును తెలియజేస్తూ అనంతపురం నగరంలో "జయహో అమరావతి" పేరుతో విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు.
గురువారం సాయంత్రం టవర్ క్లాక్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ, సప్తగిరి సర్కిల్ మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు సాగింది. ఈ సందర్భంగా అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు.
ర్యాలీలో రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, ఆర్టిసి రీజనల్ చైర్మన్ పూల నాగరాజు, వీర శైవ లింగాయత్ వెల్ఫేర్ డెవలప్మెంట్ ఛైర్మన్ స్వప్న, మార్కెట్ యార్డు ఛైర్ పర్సన్ బల్లాపల్లవి, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రాజధాని బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించడంపై పాల్గొన్న నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. ఇది ప్రజల ఆకాంక్షలకు దక్కిన విజయమని పేర్కొన్నారు.







