తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్‌గా టిపిసిసి ఉపాధ్యక్షుడు బండి రమేష్ నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనకు పలువురు నాయకుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. కార్పొరేషన్ అభివృద్ధికి కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు.
తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్‌గా టిపిసిసి ఉపాధ్యక్షుడు, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ నియామకం జరిగింది. ఈ నియామకంపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కమ్మ సేవా సంఘాల నాయకులు, హైదరాబాద్ నగరంలోని కమ్మ నాయకులు, వివిధ కులసంఘాల నాయకులు బండి రమేష్‌ను కలిసి అభినందనలు తెలిపారు.
బండి రమేష్‌ను ఆయన నివాసంలో, కార్యాలయంలో కలిసి పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాలు కప్పి సన్మానించారు. కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా, కార్పొరేషన్ అభివృద్ధికి కృషి చేయడంతో పాటు ఇతర సంఘాల కార్పొరేషన్ల అభివృద్ధికి కూడా తోడ్పాటు అందించాలని నాయకులు ఆకాంక్షించారు.
పార్టీ పట్ల బండి రమేష్కున్న నిబద్ధత, నిజాయితీ, కష్టపడే తత్వం, అందరినీ కలుపుకుపోయే విధానాన్ని పార్టీ అధిష్టానం గుర్తించి ఈ పదవిని కేటాయించిందని పలువురు నాయకులు పేర్కొన్నారు. పార్టీ అభివృద్ధికి, నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న రమేష్ పార్టీలో ఉన్నత స్థానాన్ని చేరుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు.
తనకు పార్టీ ఇచ్చిన పదవులను బాధ్యతగా, గౌరవంగా భావిస్తానని బండి రమేష్ తెలిపారు. అందరినీ కలుపుకుపోతూ, తన శక్తి మేరకు ఆ పదవులకు వన్నె తెచ్చేలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ నియామకం కాంగ్రెస్ పార్టీకి మరింత బలాన్ని చేకూరుస్తుందని నాయకులు అభిప్రాయపడ్డారు.











