తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ కామారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జిగా గైని శ్రీనివాస్ గౌడ్ ను నియమించారు. ఈ నియామకం నేపథ్యంలో జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు.
కామారెడ్డి నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈ సన్మాన కార్యక్రమం జరిగింది. జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ ఎదురుగట్ల సంపత్ గౌడ్, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు జిల్లా మహిళా అధ్యక్షురాలు బి.వసంత తెలిపారు. శ్రీనివాస్ గౌడ్ కు పూల బొకే అందజేసి ఘనంగా సన్మానించారు.
నియామకం అనంతరం గైని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, రాబోయే టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగ, జెండా ఆవిష్కరణ కార్యక్రమం గురించి వివరించారు. ఈ నెల 19వ తేదీన జరగనున్న ఈ కార్యక్రమం కోసం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ రక్షణ సేన రాష్ట్ర నాయకులు వేముల బలరాం, జిల్లా మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు శమంత, జిల్లా మహిళా నాయకురాళ్లు అఫ్రీన్, షేక్ జాయిన్ ఆఫ్ జైనబ్, రాధా, క్రిస్టియన్ జిల్లా అధ్యక్షుడు డానియల్, జిల్లా యువజన విభాగం నాయకులు జొన్నల రాము, గంగాధర్ తో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.












