బీజేపీ అధికార ప్రతినిధిగా కప్పర ప్రసాద్ రావు నియామకం అయ్యారు. ఈ నేపథ్యంలో, బీజేపీ దళిత మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్. కుమార్, కప్పర ప్రసాద్ రావును ఘనంగా సన్మానించి, శాలువా కప్పి అభినందనలు తెలిపారు.
ఎస్. కుమార్ మాట్లాడుతూ, కప్పర ప్రసాద్ రావు పార్టీ పట్ల చూపుతున్న అంకితభావం, నిబద్ధత, కృషి ఫలితంగానే ఈ గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ పార్టీ బలోపేతానికి ఆయన మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.
కప్పర ప్రసాద్ రావు మాట్లాడుతూ, సీనియర్ జర్నలిస్టుగా విశేష సేవలందించిన ఎస్. కుమార్ తనను సన్మానించడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ సన్మానం తనపై మరింత బాధ్యతను పెంచిందని ఆయన అన్నారు. జర్నలిజం రంగంలో అగ్రగామిగా పనిచేసి, బిర్లా అవార్డు గ్రహీతగా నిలిచిన ఎస్. కుమార్ ఎంతోమందికి ఆదర్శంగా ఉన్నారని ప్రసాద్ కొనియాడారు.
పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేందుకు కట్టుబడి పనిచేస్తానని కప్పర ప్రసాద్ రావు హామీ ఇచ్చారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే తన ముఖ్య లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.











