బీఆర్ఎస్ ను మళ్లీ టీఆర్ఎస్ గా మార్పు చేయడాన్ని పరిశీలిస్తామని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ ను మళ్లీ టీఆర్ఎస్ గా మార్పు చేయడాన్ని పరిశీలిస్తామని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తమ పార్టీకి పొత్తులతో కలిసిరావడం లేదని, అలాంటి ఒప్పందాలు కుదరవని ఆయన పేర్కొన్నారు. గతంలో తాము కూడా కొన్ని తప్పులు చేసి ఉండవచ్చని, వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తామని కేటీఆర్ తెలిపారు.
రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పథకాల్లోనూ విఫలమైందని ఆయన విమర్శించారు.
ప్రభుత్వ విధానాలను ఆయన తప్పుబట్టారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ఎన్నికల వ్యూహాలపై కేటీఆర్ పలు అంశాలను పార్టీ శ్రేణులతో చర్చించారు.