పదేళ్ల పాటు అధికారంలో ఉన్న గత ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో, ఏం ఇచ్చిందో లెక్కలతో సహా చెప్పాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు, హామీల అమలు తీరుపై ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ, గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వడం ద్వారా ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. పాండవులు సంపాదించినదంతా కౌరవుల తద్దినానికే సరిపోయినట్లుగా గత ప్రభుత్వ పరిస్థితి ఉందని ఆమె వ్యాఖ్యానించారు. లక్షల కోట్ల అప్పులకు వడ్డీలు, బిల్లుల బకాయిలు చెల్లించడానికే సరిపోతాయని అన్నారు.
మాజీ మంత్రి హరీష్ రావు తన నియోజకవర్గానికి రైతు రుణమాఫీ కాలేదని అంటున్నారని, మరి అప్పుడు ఎందుకు చేయలేదని ఆమె ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను ఆర్థిక వెసులుబాటుకు అనుగుణంగా ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని తెలిపారు. గత పదేళ్లలో ఏం చేశారో లెక్కలతో సహా చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
గత ప్రభుత్వ హయాంలో రైతులు మరణించారని, అధికారం పోయిందనే బాధతోనే హరీష్ రావు మాట్లాడుతున్నారని సీతక్క ఆరోపించారు. సీటు మారినంత మాత్రాన చరిత్ర మారదని, పదేళ్ల కాలం చాలా ఎక్కువని, అప్పుడు ఎందుకు చేయలేదని ఆమె ప్రశ్నించారు. అప్పులకు వడ్డీలు, వడ్డీలకు వడ్డీలే సరిపోతున్నాయని ఆమె అన్నారు.
ప్రతి కుటుంబానికి ఐదు లక్షల జీవిత బీమాను తమ ప్రభుత్వం పెడితే గత ప్రభుత్వం ఓర్వలేకపోతుందని మంత్రి సీతక్క అన్నారు. మట్టి, దుమ్ము పోసుకునే రాజకీయం కాదని, ముందుగా గతంలో తాము చేసిన పనులను చెప్పి, ఆ తర్వాత తాము ఏం చేయాలో చెప్పాలని ఆమె సూచించారు. మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో ప్రభుత్వ పనితీరుపై ఫైర్ అయ్యారు.











