కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన వేం నరేందర్ రెడ్డికి పీసీసీ సభ్యులు, టీపీసీసీ అధికార ప్రతినిధి డా. సత్యం శ్రీరంగం శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మర్యాదపూర్వకంగా ఆయనను కలిసి అభినందనలు తెలియజేశారు.
పీసీసీ సభ్యులు, టీపీసీసీ అధికార ప్రతినిధి డా. సత్యం శ్రీరంగం మాట్లాడుతూ, రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి తెలంగాణ ప్రజల సమస్యలను, రాష్ట్ర హక్కులను, నిధుల అవసరాలను పార్లమెంట్లో బలంగా వినిపించాలని కోరారు.
రాజ్యసభలో తెలంగాణ వాణిని మరింత బలంగా వినిపించి, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం పెంచాలని ఆకాంక్షించారు. ఆయన నిరంతర ప్రజా సేవకుడు అని, ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని అభిలషించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, శాసనసభ్యులు మేడిపల్లి సత్యం, కాంగ్రెస్ పార్టీ నాయకులు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, మరియు ఇతర తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
వేం నరేందర్ రెడ్డి పార్లమెంట్లో తెలంగాణ సమస్యలను సమర్థవంతంగా ప్రస్తావించడం ద్వారా రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు.











