సంగారెడ్డి, జూలై 27
సదాశివపేట మండలం రేజింతల్ గ్రామంలో దళితులు, మైనార్టీలు, బీసీ, పేదల స్మశాన వాటిక సమస్యను వెంటనే పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమస్యపై సోమవారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి, కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.
సదాశివపేట మండలం రేజింతల్ గ్రామంలో దళితులు, మైనార్టీలు, బీసీ, పేదల స్మశాన వాటిక సమస్యను వెంటనే పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని ధర్నా నిర్వహించి, కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ధర్నాకు ముందు కేకే భవన్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రేజింతల్ గ్రామంలో శ్మశాన వాటిక స్థలం కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ తీర్మానం ప్రకారం సర్వే నెంబరు 149లో ఉన్న 4.09 ఎకరాల ప్రభుత్వ భూమిని స్మశాన వాటిక స్థలం వెంటనే కేటాయించాలని కోరారు. స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లు అవుతున్నా కనీసం బొంద పెట్టుకోవడానికి స్థలం లేక ప్రజలు అనేక రకాల అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కలెక్టర్, ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు.
రేజింతల్ గ్రామం సమస్య పరిష్కారం అయ్యేంత వరకు సీపీఎం పార్టీ వెన్నంటి ఉంటుందని తెలిపారు. రేజింతల్ గ్రామంలో స్మశాన వాటిక సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం చేస్తామని సీపీఎం పార్టీ మండల కార్యదర్శి ప్రవీణ్ కుమార్ అన్నారు. ప్రభుత్వం వెంటనే సమస్యను పరిష్కరించకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ నాయకులు యస్.రమేష్ గౌడ్, పి.అశోక్, గ్రామ ప్రజలు వీరస్వామి, గోపాల్, భాస్కర్, సంయోజన్, మోహన్, రమేష్, బుచ్చయ్య, మాణయ్య, ఆనందం, శివయ్య, చంద్రయ్య, వినయ్ తదితరులు పాల్గొన్నారు.











