ఐదున్నర కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలకు ఈ సభ ప్రతిరూపమని, రాష్ట్ర ప్రగతికి ఎదురయ్యే సవాళ్లను శాశ్వతంగా తొలగించే యజ్ఞంలో భాగస్వామ్యులయ్యే భాగ్యం లభించిందని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సభాపతి అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.
2014లో రాష్ట్రానికి శాశ్వత రాజధాని నిర్మాణం అవసరమని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పించారని ఆయన గుర్తు చేశారు.
అయితే, 2019లో ప్రభుత్వాలు మారినప్పుడు ప్రగతి రథానికి అడ్డంకులు ఎదురయ్యాయని, ప్రభుత్వాలు మారినప్పుడల్లా నిర్ణయాలు మారకూడదని అన్నారు.
రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు సాగాలని, గతంలో ఎదురైన అడ్డంకులను అధిగమించి, రాష్ట్ర ప్రగతిని వేగవంతం చేయాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ దిశగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సభాపతి పిలుపునిచ్చారు.







