నిజామాబాద్, జూలై 26
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు నిజామాబాద్‌లోని 36, 37 డివిజన్లలో ఆదివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బొబ్బిలి రామకృష్ణ పాల్గొన్నారు.
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు 36, 37 డివిజన్లలో ఆదివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఎస్ఐఆర్ పరిశీలకుడు గన్‌రాజ్ పర్యవేక్షణలో, బండారి రమేష్ సమన్వయంతో 36వ డివిజన్ ఇన్చార్జి విక్కీ యాదవ్, 37వ డివిజన్ ఇన్చార్జి కరిపే శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ముఖ్య అతిథిగా బొబ్బిలి రామకృష్ణ పాల్గొన్నారు.
ర్యాలీ అనంతరం నాయకులు ఇంటింటికీ వెళ్లి స్థానికులను కలుసుకుని ఎన్యూమరేషన్ ఫారాలపై ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. అలాగే తమ ఫారాలను బూత్ స్థాయి అధికారులకు (బీఎల్వో) అందజేశారా లేదా అనే విషయాన్ని ఆరా తీశారు.
ఎస్ఐఆర్ ప్రక్రియను ప్రతి ఓటరు సకాలంలో పూర్తి చేసి ప్రజాస్వామ్య ప్రక్రియకు సహకరించాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో 43వ డివిజన్ కార్పొరేటర్ ఎర్రం గంగాధర్, 38వ డివిజన్ కార్పొరేటర్ ప్రవీణ్ యాదవ్, కో-ఆప్షన్ సభ్యుడు బొబ్బిలి మురళి, ఈఆర్వో కోఆర్డినేటర్ వహీద్, ధాత్రిక భాస్కర్, ఆకుల వెంకటేష్, అష్రఫ్ తదితరులు పాల్గొన్నారు.











